https://www.teluguglobal.com/h-upload/2024/11/11/1376733-ram-gopal-varma.webp
2024-11-11 07:08:40.0
వ్యూహం సినిమా ప్రమోషన్‌లో చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు
వివాదాస్పద,సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఐటీ చట్టం కింద కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్ల సమయంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, బ్రాహ్మణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టు చేశారని ఆయనపై ఫిర్యాదు చేశారు. టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Case registered,Against,Director Ramgopal Verma,Comments,Vyooham movie promotion