2025-01-07 03:46:43.0
ఏఐసీసీ ఆఫీస్ ఎదుట యూ టర్న్ కాంగ్రెస్ అంటూ పోస్టర్లు
రైతు భరోసా సెగ ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ను తాకింది. తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించి అధికారంలోకి తెస్తే ఏడాదికి ఎకరానికి రూ.15 వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ పేరుతో హామీ ఇచ్చి.. గద్దెనెక్కిన తర్వాత రైతులను నిండా ముంచారని కొందరు పోస్టర్లు వేశారు. 2024లో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎకరానికి రూ.15 వేలు ఇస్తామన్న రైతుభరోసా హామీని నిలబెట్టుకోలేదని.. రేవంత్ యూటర్న్ సీఎం అని పోస్టర్లలో పేర్కొన్నారు. కాంగ్రెస్ రైతు భరోసా యూటర్న్ అని తమ నిరసనను పోస్టర్ల ద్వారా తెలియజెప్పారు.
Rythu Barosa,Congress Party,Rahul Gandhi,Revanth Reddy,U Turn,Posters,AICC Office