2025-01-28 11:12:54.0
అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి అవకాశమిచ్చిన సుప్రీం కోర్టు
https://www.teluguglobal.com/h-upload/2025/01/28/1398312-tahir-hussain.webp
ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితుడు, ముస్తఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ మజ్లీస్ పార్టీ (ఏఐఎంఐఎం) అభ్యర్థి తాహిర్ హుస్సేన్‌కు సుప్రీం కోర్టు కస్టడీ పెరోల్ మంజూరు చేసింది. బుధవారం నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు కస్టడీ పెరోల్ పై ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. కస్టడీ పెరోల్ సమయంలో తాహిర్ హుస్సేన్ ముస్తాఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ సరిహద్దులు దాటి వెళ్లరాదని ఆదేశించింది. అలాగే కరవాల్ నగర్‌లోని తన ఇంటిని సందర్శించడానికి కూడా అనుమతి లేదని తేల్చిచెప్పింది.
Delhi Assembly Elections,Delhi Riot Case Accused,Tahir Hussain,AIMIAM Candidate,Mustafabad Assembly Constituency