ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 33 శాతం పోలింగ్‌

2025-02-05 09:23:46.0

మందకొడిగా సాగుతోన్న ఓటింగ్‌

https://www.teluguglobal.com/h-upload/2025/02/05/1400527-delhi-poling.webp

దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మందకొడిగా పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 33.31 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలు ఉండగా 699 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. మొత్తం 13,766 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ కొనసాగుతోంది. తమిళనాడులోని ఈరోడ్‌ (ఈస్ట్‌) అసెంబ్లీ స్థానానికి జరుగుతోన్న ఉప ఎన్నికల్లో 42.41 శాతం, ఉత్తరప్రదేశ్‌లోని మిల్కీపూర్‌ ఉప ఎన్నికల్లో 44.59 శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కాంగ్రెస్‌ అగ్రనేత రహుల్‌ గాంధీ, ఢిల్లీ సీఎం అతిశీ, కేంద్ర మంత్రి జైశంకర్‌ సహా పలువురు ప్రముఖులు మొదటిగంటలోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Delhi Assembly Elections,AAP vs BJP,33 Percent Poling,After Noon