2025-02-05 05:11:26.0
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
https://www.teluguglobal.com/h-upload/2025/02/05/1400427-rashpathi.webp
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఈ క్రమంలో ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా కేంద్రాల వద్ద బారులు తీరారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓటు వేశారు. తొమ్మిది గంటల వరకు 8.10 శాతం పోలింగ్ నమోదైంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు ఆప్ అభ్యర్థి, ఢిల్లీ సీఎం అతిషి తన నివాసం నుంచి బయలుదేరి పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సెంట్రల్ ఢిల్లీలోని జంగ్‌పురా నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి మనీష్ సిసోడియా తన భార్యతో కలిసి లేడీ ఇర్విన్ స్కూల్‌లో పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ ఓటు వేసిన తర్వాత, ఢిల్లీ ప్రజలు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 13,766 పోలింగ్ కేంద్రాలలో ప్రజలు ఓట్లు వేస్తున్నారు. హోమ్ ఓటింగ్ సౌకర్యం ద్వారా అర్హత కలిగిన 7,553 మంది ఓటర్లలో 6,980 మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈనెల 8న ఓట్ల లెక్కింపు ఉండనుంది.
President Draupadi Murmu,Rahul Gandhi,Delhi Assembly Elections,Manish Sisodia,Delhi CM Atishi,MP Swati Maliwal,BJP,APP,Central Delhi,Governor Vinay Kumar Saxena