2025-01-17 13:04:29.0
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసింది.
https://www.teluguglobal.com/h-upload/2025/01/17/1395376-delhi.webp
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. బీజేపీ దిల్లీ శాఖ కార్యాలయం వేదికగా ‘సంకల్ప్ పత్ర’ పేరుతో మేనిఫెస్టోను కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియ సమావేశంలో మాట్లాడుతూ ‘దేశ రాజకీయాల్లో సంస్కృతిని ప్రధాని మోదీ మార్చారు. గతంలో మేనిఫెస్టోలు ప్రకటించేవారు ఆ తర్వాత వాటిని ప్రకటించిన వాళ్లు కూడా మర్చిపోయారని నడ్డా అన్నారు. బీజేపీ చెప్పింది చేస్తుంది. చెప్పనిది కూడా చేసి చూపిస్తుంది. మోదీ గ్యారెంటీ..అమలయ్యే గ్యారంటీ. 2014లో బీజేపీ ఐదు వందల హామిలిస్తే 499 హామీలు అమలు చేశాం.2019లో 235 హామీలిస్తే 225 అమలు చేశాం. మిగతా హామీలు అమలుచేసే ప్రయత్నంలో ఉన్నాయిని జేపీ నడ్డా తెలిపారు.
బీజేపీ మేనిఫెస్టోలో కీలక హామీలివే..
హోలీ, దీపావళి పండుగల సమయంలో అర్హులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్
గర్భిణీ స్త్రీల కోసం 21000 రూపాయల సాయం
ఢిల్లీ బస్తీల్లో 5 రూపాయలకే భోజనం అందించేందుకు అటల్ క్యాంటీన్ల ఏర్పాటు
మహిళా సమృద్ధి యోజన’ ద్వారా దిల్లీ మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం.
దిల్లీలో ‘ఆయుష్మాన్ భారత్’ అమలు. అదనంగా రూ.5 లక్షల హెల్త్ కవర్.
ఆప్ హయాంలో అమలైన సంక్షేమ పథకాల్లో జరిగిన అవినీతిపై దర్యాప్తు.
పేద వర్గాలకు చెందిన మహిళలకు రూ.500కే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ పంపిణీ.
60 నుంచి 70 ఏళ్లలోపు సీనియర్ సిటిజెన్లకు ప్రతినెలా రూ.2,500 పింఛను.
70 ఏళ్లకుపైబడిన వారికి రూ.3వేల పింఛను.
Delhi Assembly Elections,’Sankalp Patra,JP Nadda,Atal Canteens,LPG gas,’Ayushman Bharat’,PM MODI,APP,Delhi assembly elections,Delhi CM Atishi Marlena,Arvind Kejriwal