2025-02-20 07:18:00.0
రేఖా గుప్తాతో మంత్రులుగా కపిల్ మిశ్రా, పంకజ్‌కుమార్ సింగ్, పర్వేశ్ వర్మ, ఆశీష్ సూద్, మన్‌జిందర్ సింగ్, రవీందర్ ఇంద్రాజ్ ప్రమాణ స్వీకారం
https://www.teluguglobal.com/h-upload/2025/02/20/1405166-rekha-guptha.webp
దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం మధ్యాహ్నం రామ్‌లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో సీఎంగా రేఖాగుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. రేఖా గుప్తాతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Rekha Gupta,Takes Oath,As Delhi Chief Minister,At Ramlila Ground,Lt Governor VK Saxena,Parvesh Verma,Kapil Mishra,Ashish Sood,Pankaj Singh,Manjinder Singh Sirsa,and Ravinder Indraj