2025-01-28 12:20:00.0
బీజేపీ పరువునష్టం కేసును కొట్టేసిన కోర్టు
https://www.teluguglobal.com/h-upload/2025/01/28/1398333-atishi-marlena.webp
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ఆ రాష్ట్ర సీఎం ఆతిశీకి భారీ ఊరట లభించింది. ఆమెపై బీజేపీ దాఖలు చేసిన పరువునష్టం పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారం కొట్టేసింది. ఆమె లోక్‌సభ ఎన్నికల సమయంలో ఢిల్లీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. తమ పార్టీలో చేరకపోతే ఈడీను అడ్డుపెట్టుకొని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను బీజేపీ అరెస్టు చేయిస్తుందన్నారు. ఈ కామెంట్స్‌పై బీజేపీ నాయకులు రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దీనిని విచారించిన న్యాయస్థానం ఆతిశీ వ్యక్తిగతంగా ఏ ఒక్కరినో ఉద్దేశించి ఈ కామెంట్స్ చేయలేదని పార్టీని ఉద్దేశించి మాత్రమే మాట్లాడారని వ్యాఖ్యానించింది. ఇదే గ్రౌండ్స్‌లో బీజేపీ పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నట్టు తీర్పు వెలువరించింది. ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగనుంది. 8న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు. వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చీపురు పార్టీ ప్రయత్నిస్తుంటే.. ఈసారి ఎలాగైనా ఆమ్ ఆద్మీ పార్టీని నిలువరించి విజయం సాధించాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెలవని కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది.
Delhi CM Atishi,Defamation Suit,Delhi Assembly Elections,AAP vs BJP,Rouse Avenue Court