తండేల్’ నుంచి ‘బుజ్జి తల్లి’ ఫుల్ సాంగ్‌ వచ్చేంది

 

2025-01-11 14:37:14.0

https://www.teluguglobal.com/h-upload/2025/01/11/1393703-buukjji-thali.webp

నాగచైతన్య ‘తండేల్‌ మూవీ నుంచి బుజ్జి తల్లి’ ఫుల్ సాంగ్‌ను మేకర్స్ శనివారం విడుదల చేశారు.

టాలీవుడ్ స్టార్ నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘తండేల్‌’. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ లవ్‌ స్టోరీ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. గీత ఆర్ట్స్ బ్యానర్ పై లో బన్నీ వాసు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌‌లో భాగంగా ‘బుజ్జి తల్లి’ ఫుల్ సాంగ్‌ను మేకర్స్ శనివారం విడుదల చేశారు.ఈ పాటలో సాయి పల్లవి, నాగచైతన్య జంట మధ్యలో ఉన్న ఎమోషనల్‌ జర్నీ కనిపిస్తుంది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందించారు.

సముద్రంలో చేపల కోసం వెళ్లిన ప్రియుడు ఎప్పుడు వస్తాడో అని ప్రియురాలు ఎదురుచూడడం.. ఆ విరహ వేదనలో గతంలోని మధుర స్మృతులను తలుచుకుంటూ.. బాధపడడం లాంటి విజువల్స్ ను చూపించారు. ఇక విరహ వేదన చూపించడంలో సాయిపల్లవి బ్రాండ్ అంబాసిడర్. గతేడాది విడుదల అయిన అమరన్ సినిమాలో కూడా సాయిపల్లి తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. 

 

Tandel movie,naga chatinya,sai pallavai,Geetha arts,bunny vasu,bujji thalli song,Devi sri prasad,Nagarjuna,Akkineni Akhil,Amaran movie