2023-08-05 10:55:27.0
https://www.teluguglobal.com/h-upload/2023/08/05/805655-thanthu.webp
భాగ్య నగరంలో ,
బ్రతికేవాళ్లంతా –
భాగ్యవంతులుకాదు !
భాగ్యవంతులందరూ
భాగ్యనగరం లో
ఉండాలని లేదు !
ఋతువులకు
రాజు -పేద
తేడాయేమి తెలుసు ?
వర్షాకాలం మాత్రం
తరతమ భేదంలేకుండా
నిండుకుండ
ఒకేసారి బోర్లించినట్టు
వర్షిస్తుంది! ..
భాగ్యవంతులు ఎలానూ
భవనాల్లో
సురక్షితంగా ఉంటారు!
పేదోల్ల సంగతి
చెప్పేదేముంది …
వాళ్ల గుడిసెల్లోకి
వర్షపునీరు
వరదలై
గృహప్రవేశం చేస్తుంది ‘
రాజకీయం ఎప్పటిలానే
పడవల్లో ఫోటోలుదిగి
వార్తాపత్రికల్లో
పతాకశీర్షిక అవుతుంది !
భాగ్యనగరంలోని
అభాగ్యులు అంతా …
ప్రతిసంవత్సరం
ఈ తంతు —-
వింతగా ,
గమనిస్తూనే ఉంటారు!!
-డా.కె.ఎల్.వి.ప్రసాద్.
సికింద్రాబాద్ (హన్మకొండ ).
Dr KLV Prasad,Telugu Kavithalu,Tantu