2024-12-08 08:29:36.0
టీ ఫైబర్ సేవలను ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు
టీ ఫైబర్ సేవలను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. దీనిద్వారా తక్కువధరకే ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రజా విజయోత్సవాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టీ ఫైబర్ ద్వారా మొబైల్, కంప్యూటర్, టీవీ వినియోగించవచ్చని శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ సేవలను పరిశీలించి మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. టీ ఫైబర్ ద్వారా సంగారెడ్డి జిల్లా శ్రీరాంపూర్ వాసులతో ఆయన మాట్లాడారు. మీ సేవ మొబైల్ యాప్‌ను మంత్రి ప్రారంభించారు. ఇందులో కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. రైతులు, రుణమాఫీ, బోనస్ కోసం మొబైల్ అప్లికేషన్ ప్రారంభించినట్లు శ్రీధర్‌బాబు తెలిపారు.
https://www.teluguglobal.com//telangana/internet-access-at-a-low-price-1087984Minister Sridhar Babu,Started,T fiber services,Internet access,low price