తనపై ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారారం..సీఎం రేవంత్‌కు ఎమ్మెల్యే నాయిని లేఖ

2025-02-02 05:53:56.0

తనపై ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

తనపై దురుద్దేశంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. తాను వేరే పార్టీ నేతలతో పాల్గొన్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదన్నారు. తాను ఎవరితోనూ భేటీలో పాల్గొనలేదని నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నాయిని లేఖ రాశారు. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.. కుట్ర వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదు.. పరువు నష్టం దావా వేస్తాని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేలు అందరూ ఒకచోట చేరి అభివృద్ధిపై చర్చిస్తే తప్పేముంది అని అన్నారు.

మరోవైపు కాంగ్రెస్​ప్రభుత్వంపై తిరుగుబాటు అంటూ సోషల్ మీడియా చేసిన దుమారంతో హస్తం పార్టీ ఉలిక్కిపడి అలర్ట్ అయ్యింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ కావడం వెనుకున్న శక్తులపై ఆరా తీసింది. ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డితో టీపీసీసీ చీఫ్​మహేశ్‌ కుమార్‌ గౌడ్ తాజాగా ఫోన్‌లో మాట్లాడారు. ఇలాంటి సమావేశాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏర్పాటు చేయడం సరికాదని హితవు పలికారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి లేదా.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

MLA MLA Naini Rajender Reddy,CM Revanth reddy,MLA Anirudh Reddy,TPCC Chief Mahesh Kumar Goud,Congress party,Social media,Rahul gandhi