తహవూర్‌ రాణా పిటిషన్‌ను తిరస్కరించిన యూఎస్‌ సుప్రీంకోర్టు

2025-03-07 07:35:23.0

తనను భారత్‌కు అప్పగించవద్దంటూ అమెరికా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన 26/11 ముంబయి దాడుల్లో కీలక సూత్రధారి

26/11 ముంబయి దాడుల్లో కీలక సూత్రధారి తహవూర్‌ రాణా తనను భారత్‌కు అప్పగించవద్దంటూ ఇటీవల యూఎస్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. న్యాయస్థానం దీన్ని తాజాగా తిరస్కరించింది. తాను పాకిస్థాన్ కు చెందిన ముస్లింను కావున భారత్‌ తనను హింసిస్తుందని పిటిషన్‌లో రాణా పేర్కొన్నాడు. ఇది అమెరికా చట్టాలకు ఐక్యరాజ్యసమితి నిబంధనలను ఉల్లంఘిస్తుందని పేర్కొన్నాడు. తనకు మరణశిక్ష విధించే అవకాశం ఉందని తెలిపాడు. తనను అనేకసార్లు గుండెపోటుతోపాటు పార్కిన్సన్‌ వ్యాధి, మూత్రాశయ క్యాన్సర్‌, ఉబ్బసం వంటి ప్రాణాంతక రోగాలు ఉన్నాయని వివరించాడు. తహవూర్‌ రాణాను అప్పగించాలని భారత్‌ ఎప్పటి నుంచో అమెరికాను కోరుతున్నది. ఇటీవల ప్రధాని అమెరికా పర్యటన వేళ అతడిని అప్పగించాలని ట్రంప్‌ కూడా ఆదేశించిన విషయం విదితమే. అయితే తనను అప్పగించవద్దంటూ అత్యవసరంగా మానవీయ కోణంలో తన పిటిషన్‌ ను విచారించాలని రాణా అమెరికా సుప్రీంకోర్టులో తుది పిటిషన్‌ దాఖలు చేశాడు. ఆయన పిటిషన్‌ను అమెరికా సుప్రీం నిరాకరించింది. 

US Supreme Court rejects,Tahawoor Rana’s petition,Extradition to India,files petition in US Supreme Court,26/11 Mumbai attacks