తాటి ముంజలు ఎందుకు తినాలంటే

https://www.teluguglobal.com/h-upload/2024/04/23/500x300_1321480-taati-munjalu.webp
2024-04-23 08:23:01.0

వేసవిలో మాత్రమే దొరికే ప్రత్యేకమైన పండ్లు తాటి ముంజలు. వీటినే ‘ఐస్ యాపిల్స్’ అని కూడా అంటారు.

వేసవిలో మాత్రమే దొరికే ప్రత్యేకమైన పండ్లు తాటి ముంజలు. వీటినే ‘ఐస్ యాపిల్స్’ అని కూడా అంటారు. నోట్లో వేసుకోగానే కరిగిపోయే తాటి ముంజలతో బోలెడు బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా వేసవిలో వీటిని తప్పక తీసుకోవాలి. ఎందుకంటే..

తాటి ముంజల్లో క్యాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్‌తోపాటు ఫైటోన్యూట్రియెంట్లు, విటమిన్లు,​​​ ఫైబర్ వంటివి కూడా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో నీటిశాతం ఎక్కువ. సమ్మర్‌‌లో తరచూ వీటిని తీసుకోవడం ద్వారా డీహైడ్రేట్ అవ్వకుండా హెల్దీగా ఉండొచ్చు.

తాటి ముంజలకు క్యాన్సర్ల నుంచి రక్షించే గుణం ఉంది అని సైంటిఫిక్‌గా రుజువైంది. ఇవి కొన్నిరకాల ట్యూమర్లు, బ్రెస్ట్ క్యాన్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తాయి. కాబట్టి వీటిని తినడం ద్వారా క్యాన్సర్ రిస్క్ తగ్గించుకోవచ్చు.

తాటి ముంజలు తినడం ద్వారా బరువు కూడా తగ్గొచ్చు. ఇందులో శరీరానికి కావాల్సిన ముఖ్యమైన విటమిన్లతో పాటు మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇందులో క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. కాబట్టి వీటిని తీసుకోవడం ద్వారా బరువు తగ్గొచ్చు.

తాటి ముంజలు తినడం ద్వారా సమ్మర్‌‌లో జీర్ణ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అలాగే ఇవి లివర్ సమస్యలను కూడా తగ్గిస్తాయి. ముఖ్యంగా ఇవి గర్భిణుల ఆరోగ్యానికి చాలా మంచివి.

సమ్మర్ లో తరచుగా తాటి ముంజలు తినడం ద్వారా డీహైడ్రేట్ అవ్వకుండా జాగ్రత్తపడొచ్చు. సమ్మర్‌‌లో శరీరం కోల్పోయే ఎలక్ట్రోలైట్స్‌ను ఇవి బ్యాలెన్స్ చేస్తాయి. సమ్మర్‌‌లో అలసిపోయి ఇంటికొచ్చినప్పుడు ఇవి తింటే తక్షణ శక్తి లభిస్తుంది. అంతేకాదు తాటి ముంజలు తినడం ద్వారా చర్మం కూడా తాజాగా ఉంటుంది. ముఖంపై వచ్చే మచ్చలు, పొక్కుల వంటివాటిని ఇవి తగ్గిస్తాయి.

Taati Munjalu,Health Benefits,Palm Fruit,Ice Apple
Taati Munjalu, Health Benefits, Palm Fruit, Ice Apple, Telugu News, Telugu Global News

https://www.teluguglobal.com//health-life-style/ice-apple-health-benefits-of-taati-munjalu-1023419