తిరుపతిలోని రాజ్‌ పార్క్‌ హోటల్‌కు బాంబు బెదిరింపులు

2024-10-26 05:02:37.0

గురువారం కూడా తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు..అప్రమత్తమైన పోలీసులు

https://www.teluguglobal.com/h-upload/2024/10/26/1372616-raj-park.webp

తిరుపతిలోని రాజ్‌ పార్క్‌ హోటల్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో హోటల్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. మరోవైపు గురువారం కూడా తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. లీలామహల్‌ సమీపంలోని మూడు ప్రైవేట్‌ హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో హోటల్‌కు గురువారం మెయిల్‌లో బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డీఎస్పీ వెంకట నారాయణ పర్యవేక్షణలో సిబ్బంది ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు. ఎక్కడా పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నారు.