2024-11-25 14:52:21.0
వృద్ధాప్యం, ఆర్గన్ ఫెయిల్యూర్ తో మృతి చెందినట్టు నిర్దారణ
https://www.teluguglobal.com/h-upload/2024/11/25/1380865-tiger.webp
తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర జూలో మధు అనే రాయల్ బెంగాల్ టైగర్ మృతి చెందింది. 11 ఏళ్ల వయసుస్న ఈ పులి ఆర్గన్ ఫెయిల్యూర్ తో పాటు వృద్ధాప్యం కారణంగా మృతిచెందిందని ఎస్వీ వెటర్నరీ కాలేజీ వైద్యులు నిర్దారించారు. బెంగళూరులోని బన్నెరగట్ట బయోలాజికల్ పార్క్ నుంచి ఈ బెంగాల్ టైగర్ ను తిరుపతి జూకు 2018లో తీసుకువచ్చారు. వృద్ధాప్యం కారణంగా ఈ పులి రెండు నెలలుగా సరిపడా ఆహారం, నీరు కూడా తీసుకోవడం లేదని జూ క్యూరేటర్ తెలిపారు.