తిరుమలలో చిరుత కలకలం..భక్తుల ఆందోళన

2025-01-30 15:21:25.0

తిరుమలలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది.

https://www.teluguglobal.com/h-upload/2025/01/30/1398977-ttd.webp

తిరుమలలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది. తిరుమల శిలాతోరణం వద్ద ఇవాళ సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన భక్తులు.. టీటీడీ, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం సర్వదర్శన టోకెన్ల క్యూలైన్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులను టీటీడీ అప్రమత్తం చేసింది.

ఈ క్రమంలో వెంటనే టీటీడీ, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే, ప్రస్తుతం సర్వదర్శన టోకెన్ల క్యూలైన్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలోనే చిరుత సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో, భక్తులు ఆందోళనకు గురవుతున్నారు