తిరుమలలో డిక్లరేషన్‌ ఇచ్చిన పవన్‌ కుమార్తె

2024-10-02 05:03:32.0

కొన్నిరోజులుగా శ్రీవారిని దర్శించుకోవాలంటే అన్యమతస్తులు డిక్లరేషన్‌ ఇవ్వాలనే వాదనలు వినిపిస్తున్నాయి

https://www.teluguglobal.com/h-upload/2024/10/02/1365255-pawan.webp

తిరుమల శ్రీవారి దర్శనానికి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కుటుంబంతో కలిసి వెళ్లారు. ఈ సందర్భగా ఆయన చిన్న కుమార్తె పొలెనా అంజనా కొణిదెల డిక్లరేషన్‌ ఇచ్చింది. టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్‌ పత్రాలపై పవన్‌ సంతకం చేశారు. పొలెనా మైనర్‌ కావడంతో తండ్రిగా ఆయన సంతకాలు పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది.

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఆరోపణల నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వెళ్తున్నట్లు మాజీ సీఎం జగన్‌ ప్రకటించాక ఆయన డిక్లేరేషన్‌ పత్రాలపై సంతకం చేయాలని అధికార కూటమి ప్రభుత్వ నేతలతో పాటు జగన్‌ సోదరి షర్మిల స్పష్టం చేశారు. తిరుమలలో అన్యమతస్తులు డిక్లరేషన్‌ ఇవ్వాలనే వాదన కొన్నిరోజులుగా వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఆలయంలో ప్రవేశించాలంటే.. హైందవేతరులు డిక్లరేషన్‌ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపే బోర్డులు తిరుమలలో ఏర్పాటు చేశారు. ఎప్పుడూ లేని విధంగా అన్ని ప్రధాన క్యూలైన్ల వద్ద ఇవి వెలిశాయి. అయితే జగన్‌ తిరుముల పర్యటనకు ముందు వెలిశాయి. ఆయన పర్యటన రద్దయిన తర్వాత అవి మాయం కావడం గమనార్హం.