తిరుమల తొక్కిసలాట బాధితులకు జగన్ పరామర్శ

2025-01-09 13:31:29.0

తిరుపతి తొక్కిసలాట బాధితుల్ని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు.

https://www.teluguglobal.com/h-upload/2025/01/09/1393069-jagan.webp

తిరుమల తొక్కిసలాట బాధితుల్ని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. పద్మావతి మెడికల్‌ కాలేజీకి చెందిన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో మాట్లాడి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీంతో వారిని కలిసి జగన్ ధైర్యం చెప్పారు. ప్రభుత్వం న్యాయం చేసే వరకూ పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. క్షతగాత్రులను పరామర్శించే అవకాశం ఉన్న తరుణంలో వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు.తిరుచానూరు క్రాస్‌ వద్ద జగన్‌ కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు.

పోలీసులు కాన్వాయ్‌ను అడ్డుకున్న క్రమంలో కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లిన వైఎస్‌ జగన్‌.. ఆపై స్థానిక నేత వాహనంలో తిరుపతికి బయల్దేరి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల కోసం క్యూలైన్లలో బారులు తీరిన నేపథ్యంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులకు తిరుపతిలోని వివిధ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు