2024-09-22 09:24:29.0
తిరుమల శ్రీవారి లడ్డూ నాణ్యతపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ లేఖ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
https://www.teluguglobal.com/h-upload/2024/09/22/1361811-jagan.webp
టీటీడీ లడ్డూ వివాదంపై ప్రధాని మోదీకి వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసమే అబద్ధపు ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. 2014-15 లో 14-15 సార్లు నెయ్యి ట్యాంకర్ల రిజెక్ట్ అయ్యాయి. 2019-24 లో 18 సార్ల వెనక్కి పంపామని పేర్కొన్నారు. 2 నెలల కింద ఒక ట్యాంకర్ రిజెక్ట్ అయింది.
ముఖ్యమంత్రి వ్యాఖ్యల వల్ల స్వామివారి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, సీఎం పదవి ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరించారని జగన్ ఫిర్యాదు చేశారు. తిరుమల సాంప్రదాయాలపై అనుమానాలు పెంచేవిధంగా మాట్లాడారని, సున్నితమైన అంశాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారని పేర్కొన్నారు. శ్రీవారి ప్రతిష్టను దిగజార్చిన చంద్రబాబుకు బుద్ది చెప్పాలని లేఖలో డిమాండ్ చేశారు.