2025-01-04 09:37:03.0
https://www.teluguglobal.com/h-upload/2025/01/04/1391529-jahanvi.webp
తిరుమల శ్రీవారి సన్నిధిలో మరోసారి నటి జాన్వీ కపూర్ మెరిసారు.
బాలీవుడ్ నటి నటి జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఇవాళ శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఆమె తిరుమలకు చేరుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం జాన్వీకి రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
కాగా, ఆమె ఇంతకుముందు కూడా పలుమార్లు శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన విషయం తెలిసిందే. జాన్వీ కపూర్, తన బాయ్ ప్రెండ్ శిఖర్ పహారియా దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశ్వీరదీంచగా…అధికార్లు తీర్దప్రసాదాలు అందజేసారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇక జాన్వీ కపూర్ టాలీవుడ్లో ‘దేవర’ సినిమాతో అరంగేట్రం చేశారు. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉన్న సమయంలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పక్కన నటించే అకాశం దక్కించుకున్నారు. ఉప్పెన ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్‌కు జోడిగా ఆమె నటించనున్నారు.
Actress Janhvi Kapoor,Tirumala Srivari,TTD,TTD officials,Shikhar Paharia,Tollywood,Devara’ movie,TTD Chairman br naidu,CM Chandrababu,Nara lokesh,Pawan kalyan