2024-11-13 14:04:44.0
https://www.teluguglobal.com/h-upload/2024/11/13/1377518-varun-tej-matka-team.webp
రేపు మట్కా విడుదల కానున్న నేపథ్యంలో స్వామివారి ఆశీస్సులు తీసుకున్న మూవీ టీమ్
తిరుమల శ్రీవారిని హీరో వరుణ్ తేజ్, మట్కా టీమ్ యూనిట్ బుధవారం దర్శించుకున్నారు. కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన మట్కా మూవీలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా గురువారం విడుదల కానుంది. సినిమా రిలీజ్ కు ఒకరోజు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చిత్ర యూనిట్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికి దర్శనం చేయించారు. అనంతరం ఆలయ పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. మూవీ ప్రమోషన్ లో భాగంగా తిరుపతిలో బుధవారం నిర్వహించే ఈవెంట్ సినిమా యూనిట్ పాల్గొననుంది. మట్కా జూదాన్ని ముంబైలో ప్రారంభించిన రతన్ ఖాత్రి జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
Matka Movie,Varuntej,Meenakshi Chowdari,Nora fathehi,Karuna Kumar,Tirumala,Special Prayers