2025-03-14 09:08:17.0
దర్శనం అనంతరం తన సినిమా అప్‌డేట్స్ గురించి పలు విషయాలు వెల్లడించిన నటి
తిరుమల శ్రీవారిని సినీ నటి సంయుక్త మేనన్ దర్శించుకున్నారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న ఆమెకు అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సంయుక్త తన సినిమా అప్‌డేట్స్ గురించి పలు విషయాలు చెప్పారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ప్రస్తుతం రెండు మూడు సినిమాల షూటింగ్‌లు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ “అఖండ 2” విడుదల కానున్నది. ‘స్వయంభూ’ కూడా విడుదల కోసం ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు.
Actress Samyuktha Menon,Visits,Tirumala,Revealed,Movie updates