తిరుమల శ్రీవారి హుండీలో నగదు చోరీ

https://www.teluguglobal.com/h-upload/2024/11/26/1380919-ttd.webp

2024-11-26 04:26:42.0

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

తిరుమల శ్రీవారి హుండీలో నగదు చోరీ జరిగింది. ఈ నెల 23న మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయంలోని స్టీల్‌ హుండీ నుంచి తమిళనాడుకు చెందిన వేణులింగం నగదు చోరీ చేసి పారిపోయాడు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా చోరీ జరిగినట్లు భద్రతా సిబ్బంది గుర్తించింది. అదే రోజు సాయంత్రం 6 గంటలకు నిందితుడిని పట్టుకున్నారు. దొంగిలించిన రూ. 15 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నిందితుడిని టీటీడీ విజిలెన్స్‌ అధికారులకు అప్పగించారు.

Tirumala Tirupati Devasthanam,Cash theft,Incident came,Police Caught,Accused