2025-02-18 11:05:29.0
తీన్మార్ మల్లన్నను వెంటనే అరెస్టు చేసి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్న రెడ్డి సంఘాలు నిర్వహించాయి.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను వెంటనే అరెస్టు చేసి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ వద్ద రెడ్డి జాగృతి సంఘం నేతల నిరసన చేపట్టారు. మల్లన్నపై పీసీసీకి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము కాంగ్రెస్‌ను బహిష్కరిస్తామని రెడ్డి జాగృతి నేతలు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే తెలంగాణ కులగణనపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ పీసీసీ అధిష్టానం నోటీసులు జారీ చేసింది.
MLC Tinmar Mallanna,Gandhi Bhavan,Reddy communities,Congress party,CM Revanth reddy,KCR,KTR,BRS Party