2024-10-24 05:02:22.0
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని తీర ప్రాంతాల వెంట ఈదురు గాలులు..మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచన
https://www.teluguglobal.com/h-upload/2024/10/24/1371972-dana.webp
వాయవ్య బంగాళాఖాతంలో ‘దానా’ తీవ్ర తుపానుగా మారింది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నది. పారదీప్ (ఒడిషా)కు 260 కిలోమీటర్ల దూరంలో.. ధమ్రా (ఒడిషా)కు 290 కిలోమీటర్ల దూరంలో.. సాగర్ ద్వీపానికి (బెంగాల్) 350 కిలోమీటర్ల దూరంలో తీవ్ర తుపాను కేంద్రీకృతమైంది. నేడు అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాములోపు తీరం దాటే అవకాశం ఉన్నది. పూరీ-సాగర్ ద్వీపం మధ్య భితర్‌కనికా-ధ్రమా సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నది. తీవ్ర తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం మేఘావృతమైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని తీర ప్రాంతాల వెంట ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.
‘Dana’ turned,Severe storm,Chance of heavy rains,Fishermen are advised,Not to go hunting