2024-11-25 11:29:00.0
వర్చువల్ గా ఏపీలో పలు పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని
https://www.teluguglobal.com/h-upload/2024/11/25/1380764-modi-new.webp
ప్రధాని నరేంద్రమోదీ వైజాగ్ టూర్ క్యాన్సిల్ అయ్యింది. ఏపీలో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతోనే ఈ పర్యటనను రద్దు చేశారు. ఈమేరకు పీఎంవో అధికారిక ప్రకటన జారీ చేసింది. ఈనెల 29న ప్రధాని నరేంద్రమోదీ వైజాగ్ లో పర్యటించాల్సి ఉంది. ప్రధాని పర్యటన సందర్భంగా ఆంధ్ర చూనివర్సిటీ గ్రౌండ్ లో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కు శంకుస్థాపన చేయడంతో ఏపీలో నిర్మించిన రైల్వే ప్రాజెక్టులు, నేషనల్ హైవేలను జాతికి అంకితం చేయాల్సి ఉంది. ఆయా ప్రాజెక్టులకు ప్రధాని మోదీ వర్చువల్ గా శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని ఏపీ ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు.