తెలంగాణకు రూ.3,745 కోట్లు, ఏపీకి రూ.7,211 కోట్లు

2024-10-10 11:02:49.0

పన్నుల్లో వాటా విడుదల చేసిన కేంద్రం

సెంట్రల్‌ ట్యాక్సుల్లో స్టేట్‌ షేర్‌ ను కేంద్ర ప్రభుత్వం గురువారం రిలీజ్‌ చేసింది. అక్టోబర్‌ నెలకు సంబంధించిన అడ్వాన్స్‌ ఇన్‌స్టాల్‌ మెంట్‌ రూ.89,086 కోట్లతో కలిపి రూ.1,78,173 కోట్లు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పన్నుల్లో వాటాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటాగా రూ.3,745 కోట్లు దక్కగా, ఏపీకి రూ.7,211 కోట్లు విడుదల చేశారు. కేంద్ర పన్నుల వాటాలో ఉత్తర ప్రదేశ్‌ కు సింహభాగం దక్కింది. యూపీకి రూ.31,962 కోట్లు, బిహార్‌ కు రూ.17,921 కోట్లు, మధ్యప్రదేశ్‌ కు రూ.13,987 కోట్లు దక్కాయి. పండుగల సీజన్‌ దృష్ట్యా రాష్ట్రాల క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌ కోసం ఈ సాయం విడుదల చేస్తున్నట్టుగా కేంద్రం ప్రకటించింది.

Share of taxes,Capital expenditure,Center released,Rs.3,745 crore for Telangana,Rs.7,211 crore for AP