తెలంగాణలో ‘పుష్ప 2’ సినిమా టికెట్‌ ధరల పెంపు

 

2024-11-30 09:01:58.0

https://www.teluguglobal.com/h-upload/2024/11/30/1382233-pushpa-2.webp

ధరలు పెంచుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

‘పుష్ప 2’ సినిమా టికెట్‌ ధరలు పెంచుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. డిసెంబర్‌ 4న 9.30 గంటల నుంచి బెనిఫిట్‌ షోలతో పాటు అర్ధరాత్రి ఒంటి గంట షోకు అనుమతి ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్‌, మల్టీఫ్లెక్స్‌ల్లో బెటిఫిట్‌ షోలకు టికెట్‌ ధరలు రూ.800 గా ఖరారు చేసింది. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు అనుమతినిచ్చింది. డిసెంబర్‌ 5 నుంచి 8 వరకు సింగిల్‌ స్క్రీన్‌లో రూ. 150, మల్టీఫ్లెక్స్‌లో రూ. 200 పెంపునకు పర్మిషన్‌ ఇచ్చింది. 

 

 

‘Pushpa 2’ movie,Ticket price increase,Telangana,Highest Ticket Price Set At Rs 800,Allu Arjun,Rashmika Mandanna