తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత

2025-01-03 11:07:49.0

తెలంగాణలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోతున్నాయి

తెలంగాణలో రోజురోజుకూ చలి తీవ్రత విపరీతంగా పెరుగుతుంది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే సాధారణం కంటే నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయని వాతావరణశాఖ తెలిపింది. రానున్న రెండు రోజుల్లో ఉత్తర తెలంగాణలో చలి ప్రభావం ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా అదిలాబాద్, కుమురం భీం, నిర్మల్ జిల్లాల్లో అత్యధిక కనిష్ట ఉష్ణోగ్రతలు ఏర్పడే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, లేదంటే శ్వాసకోశ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని సూచించింది.

ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కూడా సాధారణం కంటే రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవనున్నట్టు తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో ఈశాన్య గాలులు చురుకుగా వీస్తుండటంతో చలి తీవ్రత మరింత పెరిగిందని తెలిపింది. అదిలాబాద్‌ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రత 12.8 డిగ్రీల నుంచి 7.2 డిగ్రీలకు పడిపోయిందని పేర్కొంది.

Department of Meteorology,IMD,Northen Telangana,Temperatures,Yellow alert,Adilabad District,Hyderabad