తెలంగాణలో మందుబాబులకు షాక్‌

2025-01-30 12:57:07.0

తెలంగాణలో మద్యం ధరలను దాదాపు 10 నుంచి 15 శాతం పెంచనున్నట్టు సమాచారం.

తెలంగాణలో మద్యం ప్రియులకు ప్రభుత్వం బిగ్‌ షాక్‌ ఇచ్చింది. మద్యం ధరలు భారీగా పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మద్యం ధరలను దాదాపు 10 నుంచి 15 శాతం పెంచనున్నట్టు టాక్. ఇప్పటికే దీనిపై త్రిసభ్య కమిటీ నివేదిక ఇవ్వగా ధరలు పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. సచివాలయంలో గత నాలుగైదు రోజులుగా ఎక్సైజ్ అధికారుల సమావేశమై ఈ అంశంపై చర్చించారు. వచ్చే నెల నుంచి అంటే ఫిబ్రవరి 1 నుంచి మద్యం ధరలు పెరిగే ఛాన్స్ ఉంది.

ప్రీమియం బ్రాండ్స్ అండ్ బీర్లపై 15% మద్యం ధరలు పెరిగే అవకాశం ఉంది. చీప్ లిక్కర్ రేట్లను తక్కువ శాతం పెంచాలని ఎక్సైజ్ శాఖ డిసైడ్ అయినట్లు సమాచారం.పంచాయితీ ఎన్నికల కంటే ముందే మద్యం ధరలను ప్రభుత్వం పెంచే అవకాశం ఉంది. త్రిసభ్య కమిటీ రిపోర్టును అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక, వచ్చే కేబినెట్‌ సమావేశంలో మద్యం ధరల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

CM Revanth reddy,Telangana Government,Excise Department,Tri-member committee report,Brands and beers,Minister jupally krishna rao