http://www.teluguglobal.com/wp-content/uploads/2016/06/Telangana-is-Indias-most-n.gif
2016-06-10 23:21:19.0
దేశంలోనే మాంసాహార వినియోగంలో తెలంగాణ మొదటిస్థానంలో ఉంది. దాదాపు 99 శాతం మంది ఇక్కడ నాన్‌వెజ్ ప్రియులే. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా 15 ఏళ్లు ఆపైన వయసున్న వారిని ప్రశ్నించి నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. తెలంగాణలో 98.8శాతం మంది మగవారు, 98.6శాతం మంది ఆడవాళ్లు మాంసాహారులే. ఈ విషయంలో తరువాత స్థానాల్లో పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, కేరళ రాష్ట్రాలున్నాయి. రాజస్థాన్, పంజాబ్, హర్యానాలు శాకాహారంలో మొదటిస్థానాల్లో ఉన్నాయి. తెలంగాణలో […]
దేశంలోనే మాంసాహార వినియోగంలో తెలంగాణ మొదటిస్థానంలో ఉంది. దాదాపు 99 శాతం మంది ఇక్కడ నాన్‌వెజ్ ప్రియులే. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా 15 ఏళ్లు ఆపైన వయసున్న వారిని ప్రశ్నించి నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. తెలంగాణలో 98.8శాతం మంది మగవారు, 98.6శాతం మంది ఆడవాళ్లు మాంసాహారులే. ఈ విషయంలో తరువాత స్థానాల్లో పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, కేరళ రాష్ట్రాలున్నాయి. రాజస్థాన్, పంజాబ్, హర్యానాలు శాకాహారంలో మొదటిస్థానాల్లో ఉన్నాయి.
తెలంగాణలో ప్రజలు ఇంకా సాంప్రదాయిక ఆహార విధానాలనే పాటిస్తున్నారని, అందుకే నాన్వెజ్ ఎక్కువగా తింటున్నారని, కోడి, మేక మాంసాలను చాలా ఎక్కువగా వినియోగిస్తున్నారని ఆహార నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉదయం అల్పాహారంలో సైతం మాంసం తినే అలవాటు ఇక్కడ ఉందని వారు చెబుతున్నారు. కుందేలు, నిప్పుకోడి లాంటివాటిని కూడా తెలంగాణ ప్రజలు ఎక్కువగా ఆహారంగా వాడుతున్నారని నిపుణులు అంటున్నారు.
మారుతున్న జీవనశైలి కారణంగా కులమతాలకు అతీతంగా మాంసాహారాన్ని తింటున్నారని, అందుకే ఈ సంఖ్య ఎక్కువగా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ మేకలు, గొర్రెలు, కోళ్లు లాంటి వాటి ఉత్పత్తి ఎక్కువగా ఉండటం కూడా ఇందుకు ఒక కారణమని భావిస్తున్నారు. దేశంలోనే కోళ్ల పరిశ్రమలో తెలంగాణ నాల్గవ స్థానంలో ఉంది. గొర్రెల విషయంలో రెండవ స్థానంలో ఉంది. అయితే సర్వేకోసం ఎక్కువగా హైదరాబాద్ వాసులనే ప్రశ్నించారని, జిల్లాల్లో శాకాహారులు ఎక్కువగా ఉండవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మొత్తంమీద చూసుకుంటే దేశంలో మాంసాహారుల సంఖ్య తగ్గుతుండటం విశేషం. 2004లో దేశంలో మాంసాహారుల సంఖ్య 75 శాతం ఉండగా, అది 2014కి 71శాతానికి తగ్గింది.
https://www.teluguglobal.com//2016/06/11/telangana-is-indias-most-non-vegetarian-state/