తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది : ఎమ్మెల్సీ కవిత

2025-02-13 11:40:13.0

తాము కూడా పింక్ బుక్‌లో అన్నీ రాసుకుంటున్నామని.. అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదలిపెట్టబోమని హెచ్చరించారు

కాంగ్రెస్ పార్టీపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే తాము కూడా పింక్ బుక్‌లో అన్నీ రాసుకుంటున్నామని అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరినీ వదిలి పెట్టబోమని మిత్తితో సహా చెల్లిస్తామని కవిత హెచ్చరించారు. ఇవాళ జనగామ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. లెక్కలు ఎలా రాయాలో మాకూ తెలుసు… మీ లెక్కలు తీస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత. రైతు డిక్లరేషన్‌పై ప్రజలు నిలదీస్తారనే భయంతోనే రాహుల్ గాంధీ, వరంగల్‌కు రాకుండా పారిపోయారని విమర్శించారు.

సామాజిక మాధ్యమాల్లో చిన్న విమర్శ చేసినా సీఎం రేవంత్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. పోస్టు చేసిన మరుసటి నాడే ఇంటికి పోలీసులు వచ్చి వేధిస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతారు… కానీ తెలంగాణ రేవంత్ రెడ్డి మాత్రం రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే దగా, మోసమని సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో గ్రామాల్లో నీళ్లు పారాయి.. నిధులు పారాయి.. కానీ 95 శాతం పూర్తయిన సమ్మక్క-సారక్క బ్యారేజీ పనులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోతోందని.. ఇది చేతగాని దద్దమ్మ సీఎం రేవంత్‌రెడ్డిని ఆమె అన్నారు.

Congress Party,BRS Party,MLC Kavitha,CM Revanth Reddy,Rahul Gandhi,Pink Book,Janagama district,KCR,KTR,Thatikonda rajaiah