2024-11-13 09:03:19.0
ఆరు గ్యారంటీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదు : కేంద్ర మంత్రి బండి సంజయ్
https://www.teluguglobal.com/h-upload/2024/11/13/1377379-bandi-sanjay-today.webp
తెలంగాణలో 15 పర్సెంట్ కమీషన్ ప్రభుత్వం నడుస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. బుధవారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్‌ఆర్ ట్యాక్స్ పేరుతో తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం లూటీ చేస్తోందన్నారు. ఇండస్ట్రియలిస్టులు, బిల్డర్లు, ఇతర వ్యాపారుల నుంచి బలవంతంగా కమీషన్లు దండుకుంటున్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు అడ్డగోలు హామీలిచ్చి.. గద్దెనెక్కిన తర్వాత ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. తెలంగాణలో ప్రజలకు ఏమీ చేయకున్నా అన్ని చేసేసినట్టు రూ.కోట్లల్లో యాడ్స్ ఇచ్చి మహారాష్ట్ర ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని తెలిపారు. తెలంగాణ పైసలను మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని అన్నారు. ముస్లింలకు మత పరమైన రిజర్వేషన్లు ఇవ్వడాన్ని సుప్రీం కోర్టే కొట్టేసిందని గుర్తు చేశారు. అయినా మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్తూ కాంగ్రెస్ మైనార్టీలను మోసం చేస్తుందన్నారు. కుల గణన పేరుతో ప్రజల ఆస్తిపాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కన్నేసిందని, రేపు దేశ ప్రజల ఆస్తులు లాక్కోవాలని చూస్తోందన్నారు. మొగల్స్ కోటను బద్దలు కొట్టిన ఛత్రపతి శివాజీ పాలించిన గడ్డ ఇదని.. ఆయన వారసులుగా మరాఠా ప్రజలు కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
Telangana,Congress,15 Percent Govt,Bandi Sanjay,CM Revanth Reddy,Six Guarantees,Election Promises