2025-02-13 13:30:05.0
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
https://www.teluguglobal.com/h-upload/2025/02/13/1403154-niramala.webp
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో షాకింగ్ కామెంట్స్ చేశారు. విభజనకు ముందు తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉండేదని ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయిందని ఆమె వెల్లడించారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపదని ఆమె స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని విపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆమె స్పందించారు. రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు సరైన ప్రాధాన్యత దక్కిందని ఆమె అన్నారు.
బడ్జెట్లో బీహార్‌తో పాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారనడం సరికాదని ఆమె అన్నారు. తెలంగాణకు కూడా నిధులు ఇచ్చామని తెలిపారు. తెలంగాణకు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఇచ్చామని ఆమె వెల్లడించారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తెలంగాణలోని మెదక్, లోక్ సభ నుండి చేసి గెలిచారని, కానీ అక్కడ రైల్వే స్టేషన్‌ను ఏర్పాటు చేసింది ప్రధాని మోదీ అని ఆమె అన్నారు. సమ్మక్క సారక్క, రామగుండం ప్లాంట్, పసుపు బోర్డు తెలంగాణకు ప్రధాన్యతాంశాలని ఆమె పేర్కొన్నారు. పసుపు బోర్డును ఇచ్చింది ప్రధాని అని ఆమె అన్నారు.
Nirmala Sitharaman,Telangana,CM Revanth reddy,Congress party,Kakatiya Mega Textile Park,Indira Gandhi,Prime Minister Modi,Ramagundam Plant,Yellow Board,BRS Party,KCR,KTR