2024-09-20 13:15:16.0
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ మండిపడ్డారు. హస్తం పార్టీని అర్బన్ నక్సల్స్, తుక్డే తుక్డే గ్యాంగ్ నడిపిస్తోందని ప్రధాని ఆరోపించారు. మహారాష్ట్రలోని వార్ధాలో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు.
https://www.teluguglobal.com/h-upload/2024/09/20/1361245-pm-modi.webp
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ మండిపడ్డారు. హస్తం పార్టీని అర్బన్ నక్సల్స్, తుక్డే తుక్డే గ్యాంగ్ నడిపిస్తోందని ప్రధాని ఆరోపించారు. మహారాష్ట్రలోని వార్ధాలో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. ప్రస్తుత ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒకప్పటి పార్టీ కాదని హస్తం పార్టీలో దేశ భక్తి లేదన్నారు. కాంగ్రెస్ అంటేనే అబద్దం, మోసం, దగా అని విమర్శించారు. తెలంగాణలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం తప్పించుకోని తిరుగుతోందని ప్రధాని ఆరోపించారు. కర్ణాటకలోనూ కాంగ్రెస్ రైతులను మోసగించిందన్నారు. నేటి కాంగ్రెస్ గణపతి పూజను కూడా అసహ్యించుకుంటోందని మండిపడ్డారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో లోకమాన్య బాల గంగాధర్ తిలక్ దేశ ఐక్యతను పెంచడానికి గణపతి ఉత్సవాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
ఇందులో అన్ని ప్రాంతాల, వర్గాల ప్రజలు కలిసి పాల్గొంటారన్నారు. కర్ణాటకలో ఇందిరమ్మ రాజ్యం వినాయకుడి విగ్రహాన్ని పోలీసు జీపులో ఎక్కించి, అవమానించిన ఘటన అందరికీ తెలుసన్నారు. అందరం ఏకమై కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని మోదీ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మోదీ పరోక్షంగా విమర్మలు గుప్పించారు. విదేశాలకు వెళ్లి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ భరతమాతను, భారత దేశ సంస్కృతిని అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అత్యంత అవినీతికరమైన కుటుంబం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ రాజకుటుంబమే అని ప్రధాని ఫైర్ అయ్యారు.
PM Modi,Rahul gandhi,Maharashtra,Wardha Sabha,Congress party,Telangana government,Loan waiver