2025-01-03 15:03:22.0
తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.
తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఈ విషయాన్ని అధికారికంగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు పుల్లెల గోపిచంద్ ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతు తెలంగాణను క్రీడలకు హబ్ గా మారుస్తాం అన్నారు. రాష్ట్రాన్ని క్రీడల హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తామని తెలిపారు. దక్షిణ కొరియాలోని ఒక చిన్న స్పోర్ట్స్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ఇటీవల జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ లో 37 పతకాలు సాధించారు.
ఈ స్ఫూర్తితోనే తెలంగాణలోనూ స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించబోతున్నాం. అకడమిక్స్, గేమ్స్ ను మిళితం చేస్తూ విద్యార్థి వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చి దిద్దుతూ.. ప్రతిభను వెలికితీసేందుకు స్పోర్ట్స్ పాలసీకి రూపకల్పన చేస్తున్నాం. ఈ ప్రక్రియలో విద్యావేత్తలు, ప్రముఖ క్రీడాకారులను భాగస్వామ్యం చేస్తున్నాం. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటాలన్నదే ప్రజా ప్రభుత్వం లక్ష్యం అని శ్రీధర్ బాబు పేర్కొన్నారు
Minister Sridhar Babu,Telangana Badminton Association,Pullela Gopichand,Telangana Sports University,Paris Olympics,South Korea,CM Revanth reddy,Congress party