2023-06-02 08:02:58.0
https://www.teluguglobal.com/h-upload/2023/06/02/774836-telangana-news.webp
త్యాగధనుల త్యాగఫలం
సిద్దించిన ఉద్యమఫలం
ఇన్నేళ్లు వేచిన పుణ్య ఫలం
బంగారు తెలంగాణ మా భాగ్యఫలం
దివ్యక్షేత్రాల దైవ నిలయం
భాషా సంస్కృతుల భావ నిలయం
సాంప్రదాయాల సౌరభం
బతుకమ్మ బోనాల సంబురం
ఉద్యమాల పోరుగడ్డ
పోరాటాల పురిటిగడ్డ
సింగరేణి సిరులగడ్డ
తెలంగాణ ఖనిజాల అడ్డ
కాళోజీ యాస దాశరథి భాష
సినారె కవిత జ్ఞానపీఠ గ్రహీత
సబ్బండ వర్గాల సమరస వేదిక
బంగారు తెలంగాణ భవ్య చరిత
పురోగతి కై పయనించే నెరజాణ
కోటి కాంక్షల బంగారు తెలగాణ
సుభిక్ష జీవన మధుర మాగాణ
నా తెలంగాణ కోటి రతనాల వీణ !
– బోయ వెంకటేశం
(గోటిగార్ పల్లి,సంగారెడ్డి జిల్లా)
Boya Venkatesham,Telugu Kavithalu