2025-02-11 12:34:25.0
రాష్ట్ర వ్యాప్తంగా సీసీఐ సర్వర్ పని చేయకపోవడంతో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి
రాష్ట్రంలో గత రెండు రోజులుగా కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా సర్వర్ పని చేయడంతో పత్తి కొనుగోళ్లు నిలిపివేశారు. దీంతో వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సర్వర్ ఔన్ అంటూ సాకులు చెబుతున్నారని మండిపడుతున్నారు. ప్రైవేట/ వ్యాపారులకు లాభం చేకూర్చేందుకు సర్వర్ డౌన్ పేరుతో పత్తి కొనుగోలు ఆపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీసీఐ రెండు విధాలుగా పత్తి కొనుగోళ్లు చేయవచ్చు. ఇందులో ఒకటోది బహిరంగ మార్కెట్‌లో మద్ద తు ధర కంటే తక్కువ ధరతో వ్యాపారులు కొనుగోలు చేస్తుంటే సీసీఐ రంగంలోకి దిగి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలు చేస్తూ పత్తి రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత సీసీఐపై ఉంటుంది. ఇక రెండోది ప్రైవేట్ వ్యాపారులతో పోటీపడి పత్తిని కొనుగోలు చేయడం, వ్యాపారులు ఒక్కటైతే సీసీఐ వల్ల రైతులకు న్యాయం జరుగుతుంది. కానీ సంస్థ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.
Telangana,cotton purchases,CCI,Enumamula market,Warangal,Cotton farmers,CM Revanth reddy,Telangana goverment,Minister Thummala Nageswara Rao