తెలిసిందా ….! (గజల్)

2023-02-09 13:30:48.0

https://www.teluguglobal.com/h-upload/2023/02/09/722639-telisinda.webp

గాలి మోసే పూలగంధ

మంటి ప్రేమ జాలమేంటో

తెలిసిందా

సాంబ్రాణి స్నేహాన విడిన కురుల ప్రణయ ఆలమేంటో తెలిసిందా

ప్రేమా నీవు తెలుపు భావాలెన్నో కులుకు పలుకు రాగాలెన్నో

రాగ రంజితమైన గళ రవ వర్ణాల గాలమేంటో తెలిసిందా

శూన్యం శూన్యమంతా

మనసు ఏకాంతంలోను

నిండుతూ ఉంటే

ప్రియముగ నీ వోడించి

న హృదయమేసే తాళమేంటో తెలిసిందా

కలికి మృదువౌ జిలుగు కొంగు నింగికెన్ని రంగు రంగులు పూసిందో

కవ్వించె కళుకు ఆశల శ్వాసల మెరిసె

చాలమేంటో తెలిసిందా

మల్లీ! మింటి అందానికే

అద్దమై నిలిచింది నీలి అర్ణవం

సత్యం వ్రాలీయక

తరలిపోతోందీ కాలమేంటో తెలిసిందా

 రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి

Raja Vasireddy Malleswari,Telugu Ghazals