తెల్ల జుట్టు తగ్గాలంటే ఇలా చేయాలి!

https://www.teluguglobal.com/h-upload/2024/08/09/500x300_1351216-white-hair.webp
2024-08-10 09:07:23.0

తక్కువ వయసులోనే జుట్టు తెల్లబడడం ప్రస్తుతం చాలా కామన్‌గా మారిపోయింది. అసలు తెల్ల జుట్టు ఎందుకు వస్తుంది? దీన్ని తగ్గించాలంటే ఏం చేయాలి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తక్కువ వయసులోనే జుట్టు తెల్లబడడం ప్రస్తుతం చాలా కామన్‌గా మారిపోయింది. అసలు తెల్ల జుట్టు ఎందుకు వస్తుంది? దీన్ని తగ్గించాలంటే ఏం చేయాలి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తెల్ల జుట్టుకి చాలానే కారణాలుంటాయి. జన్యు పరమైన కారణాలు పక్కన పెడితే పోషకాహార లోపం, పొల్యూషన్, హార్మోనల్ ఇంబాలెన్స్ వంటివి ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి. వీటినుంచి జుట్టుని రక్షించుకోవడం కోసం ఏం చేయాలంటే..

జుట్టుకి కావల్సిన పోషకాలు తగిన పాళ్లలో తీసుకోకపోవడం వల్ల జుట్టు త్వరగా తెల్ల బడుతుంది. ముఖ్యంగా జుట్టు నల్లగా ఉండటానికి చర్మంలో మెలనిన్ ఉత్పత్తి ఎక్కువగా జరగాలి. మెలనిన్ తగ్గితే జుట్టు తెల్లబడుతుంది. కాబట్టి తినే ఆహారంలో ఆకుకూరలు, గుడ్లు, క్యారెట్, బీట్‌రూట్ వంటివి ఎక్కువగా ఉండేలా చూసుకుంటే మంచిది.

హార్మోన్ల ఇంబాలెన్స్ వల్ల కూడా జుట్టు తెల్లబడుతుంటుంది. దీన్ని సరిచేయడం కోసం సమతుల ఆహారం తీసుకోవాలి. థైరాయిడ్ సమస్య లేకుండా చూసుకోవాలి. స్మోకింగ్, డ్రింకింగ్ వంటివి మానేయాలి. ఒత్తిడి లేని లైఫ్‌స్టైల్ గడపాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి.

జుట్టు తెల్లబడడానికి కెమికల్ ప్రొడక్ట్స్, పొల్యూషన్ వంటివి కూడా కారణమవుతాయి. కాబట్టి వీలైనంతవరకూ పొల్యూషన్‌కు దూరంగా ఉండాలి. హెయిర్ ప్రొడక్ట్స్‌ను డాక్టర్ సలహా మేరకు ఎంచుకోవాలి.

ఇక వీటితో పాటు విటమిన్–బీ12 లోపం వల్ల కూడా జుట్టు రాలడం, తెల్ల బడడం వంటి సమస్యలుంటాయి. కాబట్టి ‘బీ12’ కోసం పాలు, గుడ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పండ్లు, గ్రీన్ టీ వంటివి కూడా జుట్టుకి మేలు చేస్తాయి.

తెల్ల జుట్టుకి రంగు వేయడం వల్ల జుట్టు మరింత పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి సహజంగానే జుట్టుని నల్లగా మార్చే ప్రయత్నం చేయాలి. కావాలంటే హెన్నా, బ్లాక్ టీ వంటివి వాడొచ్చు.

White Hair,Hair,How To Stop White Hair
White Hair, How To Stop White Hair, Hair, How to stop my increasing white hair, తెల్ల జుట్టు, జన్యు పరమైన, లోపం, పొల్యూషన్, హార్మోనల్ ఇంబాలెన్స్

https://www.teluguglobal.com//health-life-style/how-to-stop-my-increasing-white-hair-1057397