2025-02-13 09:11:52.0
తెలంగాణలో త్వరలోనే బీసీ ముఖ్యమంత్రి అవుతాడని లోక్ సభ ఎంపీ మల్లు రవి హాట్ కామెంట్స్ చేశారు.
నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో త్వరలోనే బీసీ ముఖ్యమంత్రి అవుతాడని మల్లు రవి బాంబు పేల్చాడు. రాష్ట్రంలో ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ఓసీ సీఎం, బీసీ టీపీసీసీ అధ్యక్షుడు ఉన్నారని తెలిపారు. ఎప్పుడైనా సమయం వస్తే “బీసీ ముఖ్యమంత్రి” అవుతారని అవకాశం ఉందన్నారు. బీసీలకు రాష్ట్ర మంత్రివర్గంలో 42% వాటా అమలుపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. దీంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీటు పోతుందని అందరూ చర్చించుకుంటున్నారు.
మొత్తానికి కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి చేసిన కామెంట్స్ ఇప్పుడు..తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ హక్కులపై పోరాడుతున్న సంగతి తెలిసిందే. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి కావటం ఖాయమని సంకేతకం ఇచ్చారు. రేవంత్ రెడ్డే చివరి ఓసీ సీఎం అని వ్యాఖ్యానించారు. తెలంగాణకు బీసీలే ఓనర్లు అని.. బీసీల ఆర్థికంగా వెనకబడ్డారని అంటున్నారని అదేదీ నిజం కాదన్నారు. అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని కొనేంత డబ్బు బీసీల దగ్గర ఉందని అన్నారు .ఫిబ్రవరి 28న వరంగల్ వేదికగా నిర్వహించిన ‘బీసీ రాజకీయ యుద్ధభేరి’ సభలో పాల్గొన్న తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.
MP Mallu Ravi,CM Revanth reddy,Telangana,Tinmar Mallanna,BC,Congress party,BRS Party,KTR,KCR,’BC is a political warlord