త్వరలోనే నథింగ్ ఫోన్ 2ఎ! స్పెషల్ ఫీచర్లేంటంటే..

https://www.teluguglobal.com/h-upload/2023/12/19/500x300_874018-nothing-phone-2a.webp
2023-12-19 10:36:22.0

‘నథింగ్ ఫోన్ 2ఎ’.. మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో ఉండబోతుంది. ఇందులో 6.7 ఇంచెస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది.

ఆండ్రాయిడ్ మార్కెట్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టించిన బ్రాండ్ నథింగ్. ఈ బ్రాండ్ నుంచి వచ్చిన ‘నథింగ్ ఫోన్ 1’, ‘నథింగ్ ఫోన్ 2’ మార్కెట్లో సూపర్ సక్సెస్ అయ్యాయి. సరికొత్త డిజైన్, స్పెషల్ ఫీచర్లతో ఈ బ్రాండ్ చాలామందికి ఫేవరెట్ అయింది. అయితే తాజాగా నథింగ్ నుంచి ‘నథింగ్ ఫోన్ 2ఎ’ రాబోతుంది. ఇదెలా ఉండబోతుందంటే..

వ‌చ్చే ఏడాదిలో ‘న‌థింగ్ ఫోన్ 2’ కి కొన‌సాగింపుగా ‘న‌థింగ్ ఫోన్ 2ఎ’ లాంచ్ అవ్వనున్నట్టు సమాచారం. 2024 ఫిబ్రవ‌రిలో జరిగే ‘మొబైల్ వ‌ర‌ల్డ్ కాంగ్రెస్ (ఎండ‌బ్ల్యూసీ)’ ఈవెంట్ వేదిక‌గా ‘నథింగ్ ఫోన్ 2ఏ’ లాంచ్ అవుతుందని టెక్ వర్గాల సమాచారం.

‘నథింగ్ ఫోన్ 2ఎ’.. మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో ఉండబోతుంది. ఇందులో 6.7 ఇంచెస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200ఎస్ఓసీ చిప్‌సెట్‌పై పనిచేస్తుంది.ఈ స్మార్ట్‌ఫోన్.. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌పై రన్ అవుతుంది. కెమెరా విషయానికొస్తే.. వెనుక‌భాగంలో డ్యుయెల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఒక‌ 50ఎంపీ కెమెరా ఉండొచ్చు. డిజైన్ విషయానికొస్తే.. ఫోన్ ముందుభాగంలో పంచ్ హోల్ నాచ్ డిస్‌ప్లేతో పాటు బ్యాక్ ప్యానెల్‌లో టాప్ సెంట‌ర్‌లో హారిజంట‌ల్ కెమెరా మాడ్యూల్‌ డిజైన్ ఉంటుంది. ఇక నథింగ్ స్పెషల్ డిజైన్ అయిన బ్యాక్ గిఫ్ ఇంటర్ఫేస్.. నథింగ్ ఫోన్ 2ని పోలి ఉండొచ్చు. ఇక ఈ ఫోన్ ధర 400 డాల‌ర్లు అంటే సుమారు రూ. 33,200 ఉండొచ్చు.

Nothing Phone 2A,Nothing Phone,Smartphone
Nothing Phone 2a, Nothing Phone, Nothing Phone 2a price, telugu news, telugu global news, new phones, new mobiles, mobiles, news

https://www.teluguglobal.com//business/nothing-phone-2a-launch-timeline-price-specs-and-other-details-tipped-981796