త్వరలో ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్‌

2025-01-31 06:01:02.0

బడ్జెట్‌లో రైతులు, మహిళలు, పేదలు, యువతకు ప్రాధాన్యం ఉంటుందన్న రాష్ట్రపతి

https://www.teluguglobal.com/h-upload/2025/01/31/1399069-president.webp

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. ఇటీవలే గణతంతర వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాం. మహా కుంభమేళా జరుగుతున్న సమయంలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభించుకుంటున్నాం. కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి విచారం వ్యక్తం చేస్తూ.. గాయపడిన బాధితులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. ఇటీవల కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. బడ్జెట్‌లో రైతులు, మహిళలు, పేదలు, యువతకు ప్రాధాన్యం ఉంటుందని రాష్ట్రపతి అన్నారు. పేదరిక నిర్మూలన కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నాం. పీఎం ఆవాస్‌ యోజన ద్వారా లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తున్నాం. అమృత్‌ భారత్‌, నమో భారత్‌ రైళ్లు ప్రవేశపెడుతున్నాం. ప్రభుత్వం మూడు రెట్ల వేగంతో పనిచేస్తున్నది. త్వరలో ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్‌ మారనున్నది.

ప్రభుత్వం మూడు రెట్ల వేగంతో పనిచేస్తున్నది. కొత్త పథకాలు వేగవంతంగా అమలుచేస్తున్నాం. ఒకే దేశం-ఒకే ఎన్నికలు, వక్ఫ్‌ బోర్డు అంశాలపై సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు లబ్ధి చేకూర్చుతున్నాయి. 70 ఏళ్లు దాటిన 6 కోట్ల మందికి ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా ఆరోగ్యబీమా అమలు చేస్తున్నాం. పీఎం ఆవాస్‌ యోజన ద్వారా మరో 3 కోట్ల కుటుంబాలకు ఇళ్లు నిర్మించనున్నది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు గొప్ప ముందడుగు అన్నారు. యువతకు ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. 25 కోట్ల మంది పేదలను దారిద్య్రం నుంచి బైటికి తెచ్చాం. మహిళలు వేగంగా సాధికారత సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నదన్నారు. 

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు సాగు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర అందిస్తున్నాం. కచ్చితమైన వాతావరణ సమాచారాన్ని అందించడానికి రూ. 2000 కోట్లతో ‘మిషన్‌ మౌసం’ను ప్రారంభించాం. సహకార రంగంలో అనేక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు మెరుగయ్యాయి. సంస్కరణలు, పనితీరు, పరివర్తన అనేవి ప్రభుత్వ పాలనకు బలమైన స్తంభాలుగా మారాయన్నారు. పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, ఈ ప్రాజెక్టుకు కేంద్రం రూ. 12 వేల కోట్లు కేటాయించిందని రాష్ట్రపతి గుర్తు చేశారు.

సరిహద్దుల రక్షణ, అంతర్గత భద్రల కోసం ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నది. వామపక్ష అతివాదానికి వ్యతిరేకంగా పోరాటం చివరిదశకు చేరింది. నక్సల్స్‌ ప్రభావిత జిల్లాల సంఖ్య 38కి తగ్గింది. రక్షణ రంగంలో స్వావలంబన దిశగా కీలక అడుగులు వేస్తున్నాం. సామాజిక, ఆర్థిక, రాజకీయ సుస్థిరతలో ఈ ప్రపంచానికి భారత్‌ ఆదర్శంగా నిలిచింది. మన ముందున్న ఏకైక లక్ష్యం.. వికసిత్‌ భారత్‌ నిర్మాణమే అని రాష్ట్రపతి తెలిపారు. 

President Murmu says,NDA Government,Working with thrice the speed,2025 Budget Session,’One Nation,One Election’