2025-01-27 17:01:48.0
రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు పదహారేళ్లలోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించవద్దన్న హైకోర్టు
సినిమా థియేటర్లకు పదహారేళ్లలోపు పిల్లలు వెళ్లే సమయ వేళలపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు విధించింది. సినిమా టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతిపై విచారణ సందర్భంగా బి. విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు పదహారేళ్లలోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. వేళాపాలా లేని షోలకు పిల్లలు వెళ్లడం వల్ల వాళ్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని పిటిషన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలతో న్యాయస్థానాం ఏకీభవించింది. ఈ మేరకు అన్నివర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించింది.పిటిషన్‌పై తదుపరి విచారణను ఫిబ్రవరి 22కు వాయిదా వేసింది.
Telangana high court,Key comments,On the timings,Under sixteen years age Children,Not allowed Cinema theatres