దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం.. 41 మంది సజీవ దహనం

2025-02-09 06:09:52.0

దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం సంభవించింది.

దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం సంభవించింది. అతివేగంగా వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి ట్రక్కును ఢీ కొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. 41 మంది సజీవ దహనమయ్యారు. ఈ సమయంలో బస్సులో 48 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటన టబాస్కో రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున ఈఘటన జరిగింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్లూ ప్రాణాలు కోల్పోగా.. ట్రక్కు డ్రైవర్‌ కూడా మృతి చెందారు. ఘటనా స్థలంలో ఇప్పటి వరకు 18 మందికి చెందిన అవశేషాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు.

Southern Mexico,Tabasco State,terrible accident,Crime news,international news