దర్శకుడిగా దళపతి విజయ్‌ తనయుడు

 

2024-11-29 13:52:49.0

https://www.teluguglobal.com/h-upload/2024/11/29/1382076-jesan-sanjay.webp

త్వరలో సందీప్‌ కిషన్‌ తో సినిమా

తమిళ హీరో దళపతి విజయ్‌ తనయుడు జేసన్‌ సంజయ్‌ దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. త్వరలోనే జేసన్‌ డైరెక్షన్‌లో సినిమా తెరకెక్కబోతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌ ఈ సినిమాను ప్రొడ్యూస్‌ చేస్తోంది. తెలుగు హీరో సందీప్‌ కిషన్‌ హీరోగా ఈ సినిమా రాబోతుందని లైకా ప్రొడక్షన్‌ ఎనౌన్స్‌ చేసింది. ”జేసన్‌ సంజయ్‌ 01” వర్కింగ్‌ టైటిల్‌లో రాబోతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ ను నిర్మాణ సంస్థ రిలీజ్‌ చేసింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. థమన్‌ ఈ సినిమాకు సంగీతం సమకూర్చుతున్నాడు. 

 

Dalapathi Vijay,Jason Sanjay,Sandeep Kishan,LYCA Productions,Debut as Director