2025-01-09 08:55:07.0
తెలంగాణ ప్రజల సంస్కృతిని అవమానించేలా మాట్లాడిన దిల్ రాజు సినిమాను తిరస్కరించాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు
తెలంగాణ ప్రజల సంస్కృతిని అవమానించేలా మాట్లాడిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినిమాను తిరస్కరించాలని రాష్ట్ర ప్రజలను ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కోరారు. తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్యే రసమయితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిజామాబాద్ లో నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో దిల్ రాజు సంక్రాంతి పండుగకు ఆంధ్రాలా తెలంగాణలో వైబ్స్ ఉండదు. తెల్ల కల్లు, మటన్ మాంసం మీద వైబ్స్ ఉంటాయని ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీనిపై తెలంగాణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయ్యా దిల్ రాజు తెలంగాణలో వైబ్ లేకుంటే సినిమాలు మానుకో. వైబ్ కావాలంటే కల్లు కంపౌండ్, మాంసం దుకాణం పెట్టుకో. దిల్ రాజు ఏనాడు తెలంగాణ వ్యక్తిలా వ్యవహరించలేదు. తెలంగాణ ప్రజల సంస్కృతిని అవమానించేలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. సినిమా టికెట్ల ధరలు పెంచమన్న సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పుడు ధరల పెంపు పై ప్రజలకు సమాధానం చెప్పాలి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు నాలుకల ధోరణీ మరోసారి బయటపడింది. గేమ్ ఛేంజర్ కి ప్రత్యేక మినహాయింపులు ఎందుకు ఇచ్చారు” అంటూ ఆయన మండిపడ్డారు.ఇంత అవమాకరమైన మాటలు మాట్లాడిన దిల్ రాజు సినిమాను తెలంగాణ ప్రజలు తిరస్కరించాలి. తెలంగాణ సంస్కృతిని అవమానించారు. తెలంగాణలో బతుకైనా, చావైనా, పండుగైనా కల్లు ఉంటది.. మటన్, చికెన్ ఉంటది. నీవు తీసిన బలగం సినిమాలో కూడా ఆత్మ శాంతించాలని కల్లు పెట్టి, మటన్ పెట్టి చూపించావ్. నల్లి బొక్క మీద, కల్లు మీద, ప్రజల సంస్కృతి మీద ఆప్యాయతల మీద నీవు తీసిన సినిమాను ఆదరించారు. నీవు ఆ ఆదరణను, కృతజ్ఞతను మరిచిపోయావు. బలగం సినిమాను గొప్పగా ఆదరించారు. కానీ ఇవాళ నీవు వారినే అవమానిస్తున్నావ్. కేవలం నీ సినిమాల కోసం ఆంధ్రా వ్యక్తులను పొగుడుతూ మాట్లాడడం సరికాదని దేశపతి అన్నారు.
Producer Dil Raju,MLC Deshapati Srinivas,Former MLA Rasmayi,Nizamabad,Minister Komati Reddy Venkat Reddy,CM Revanth reddy,Telangana Bhavan,Balagam a movie