2025-01-11 16:10:40.0
https://www.teluguglobal.com/h-upload/2025/01/11/1393736-rajasabha.webp
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్ చిత్రం విడుదల తేదీ వాయిదా పడినట్టు తెలుస్తోంది.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదల తేదీ వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఆ తేదిన మూవీ విడుదల కావడం లేదని సినీ యూనిట్ తెలిపింది. ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం అవుతాయని పేర్కొన్నారు.
ఇక, అభిమానుల కోసం సంక్రాంతి సందర్భంగా ‘రాజా సాబ్’ టీమ్ నుంచి ప్రత్యేక పోస్టర్ రిలీజ్ కానుందని వివరించారు.కాగా, ‘రాజా సాబ్’ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ హీరోలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలకపాత్ర పోషిస్తున్నారు. తమిళ నటి మాళవికా మోహనన్ కు ఇది తెలుగులో ఇదే తొలి చిత్రం కానుంది. ‘రాజా సాబ్’ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.
Rebel star Prabhas,The Raja Saab Movie,Director Maruti,TG Vishwaprasad,Sanjay Dutt,Aggarwal,Malavika Mohanan,Riddhi Kumar,Kalki 2898 AD Movie