దీపం ఏడుగురు ప్రాణాలు తీసింది

https://www.teluguglobal.com/h-upload/2024/10/07/1366874-vdaadad.webp

2024-10-07 06:48:13.0

దసర నవరాత్రుల్లో బాగంగా ఇంట్లో పెట్టిన ఓ దీపం ఏడుగురు ప్రాణాలు తీసింది. ఈ విషాద సంఘటన ముంబైలో చోటు చేసుకుంది.

ముంబైలో ఇంట్లో పెట్టిన ఓ దీపం ఏడుగురు నిండు ప్రాణాలు బలి తీసింది. దుర్గ నవరాత్రుల్లో సందర్బంగా ఇంట్లో వెలిగించిన దీపమే ఈ విషాదానికి కారణమని అధికారులు పేర్కొన్నారు. మహారాష్ట్రలోని చెంబూరులోని సిద్ధార్థ్‌ కాలనీలో రెండంతస్తుల భవనంలోని గ్రౌండ్ ప్లోర్‌లో దీపం వల్ల మంటలు చెలరేగాయి.

అందులోని కిరణా దుకాణంలో 25 లీటర్ల కిరోసిన్‌ను నిల్వ ఉంచారు. దీంతో పూజ అనంతరం దీపం వెలిగించారు. దీంతో ఆ దీపం షాప్ లోని వస్తువులకు అంటుకుంది. ఈ క్రమంలోనే షాప్‌లో నిల్వ ఉంచిన కిరోసిన్‌కు మంటలు అంటుకొవడంతో వేగంగా మంటలు వ్యాప్తి చెందాయి. దీంతో ఫస్ట్, సెకండ్ ఫ్లోర్ లో ఉన్నవారు నిద్రలోనే సజీవదహనం అయినట్లు అధికారులు గుర్తించారు. 

Mumbai,Durga Navratri,Siddharth Colony,Deepam,Maharashtra